పండుగ వస్తుందంటే చాలు సినిమాల జాతర మొదలైనట్టే. తెలుగు సినీ ప్రేక్షకులు రాబోయే పండుగకు థియేటర్లలో రిలీజ్ కాబోయే సినిమాల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఏడాది దసరా బరిలో ఓ మోస్తారు సినిమాలొచ్చి.. బాక్సాఫీస్ ముందు తేలిపోయాయి. ఇక దీపావళికి వచ్చిన సినిమాలైతే బాక్సాఫీస్ను బ్లాస్ట్ చేసేలా భారీ సక్సెస్ను రుచిచూశాయి. ఇక ఇప్పుడు క్రిస్మస్ ఫెస్టివల్ స్పెషల్ గా తెలుగు, తమిళ, హాలీవుడ్ ఇలా ప్రతి రుచిని చూపించేలా ఓ నాలుగు సినిమాలు రెడీగా ఉన్నాయి.
బచ్చల మల్లి (Bachchala Malli):
హీరో అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా సుబ్బు తెరకెక్కిస్తున్న చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. విలేజ్ డ్రామాగా నైంటీస్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
‘విడుదలై-పార్ట్2’ (Viduthalai Part2):
విజయ్ సేతుపతి (Vijay Sethupathi) చేతిలో చాలా సినిమాలున్నాయి. వాటిలో జాతీయ అవార్డు విన్నర్ వెట్రిమారన్ (Vetrimaran) డైరెక్ట్ చేస్తున్న ‘విడుదలై-పార్ట్2’ (Viduthalai Part2) ఒకటి. సూరి మరో లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీ వరల్డ్ వైడ్గా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ మూవీ తెలుగు తమిళ భాషల్లో క్రిస్మస్ కానుకగా గ్రాండ్ రిలీజ్కి సిద్ధమైంది.
‘ముఫాసా: ది లయన్ కింగ్’(Mufasa The Lion King):
‘ముఫాసా: ది లయన్ కింగ్’(Mufasa The Lion King) డిసెంబర్ 20న ఇంగ్లీష్‌తో పాటు పలు భారతీయ భాషల్లోనూ థియేటర్లలో రిలీజ్ కానుంది. అకాడమీ అవార్డ్ విజేత బేరీ జెంకిన్స్ దీనికి దర్శకుడు. సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) ముఫాసా తెలుగు వెర్షన్కు వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు. దాంతో ఈ ప్రీక్వెల్పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
వరల్డ్ ఆఫ్ UI:
విలక్షణ నటుడిగా, దర్శకుడిగా ఉపేంద్ర(Upendra) దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఆయన దర్శకుడిగా తీస్తున్న మూవీ UI (UI The Movie). గ్లోబల్ వార్మింగ్, కోవిడ్ -19, ద్రవ్యోల్బణం, AI, నిరుద్యోగం, ప్రపంచ యుద్ధాలు వాటి పర్యవసానాలు ఈ సినిమాలో చూపించనున్నారు. ఓం, A, ఉపేంద్ర, ఉప్పి 2, సూపర్..లాంటి విభిన్న కథలతో డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర..ఇపుడు వరల్డ్ ఆఫ్ UI తో డిసెంబర్ 20న థియేటర్స్ లోకి రానున్నాడు.
ఇప్పటికే తనదైన ప్రమోషన్స్ తో సినిమాపై అంచనాలు పెంచేశాడు ఉపేంద్ర. ఓం, A, ఉపేంద్ర, ఉప్పి 2, సూపర్..లాంటి విభిన్న కథలతో డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఉపేంద్ర.. ఇపుడు తన కొత్త ప్రయోగంతో ఎలాంటి మ్యాజిక్ చేయనున్నాడనే ఆసక్తి నెలకొంది.
శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ (Srikakulam Sherlockholmes):
వెన్నెల కిషోర్ టైటిల్ రోల్‌లో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ దర్శకత్వంలో వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. వైజాగ్ బీచ్‌లో జరిగే వరుస హత్యల చుట్టూ కథ తిరుగుతుంది.
కేసును ఛేదించలేని పోలీసులు.. ప్రైవేట్ క్రియేటివ్ డిటెక్టివ్ (వెన్నెల కిషోర్)ను నియమిస్తారు. తను ఆ గ్రామంలోని ప్రేమజంటతో సహా ఏడుగురు అనుమానితులను గుర్తిస్తాడు. టీజర్, ట్రైలర్ విజువల్స్ తో ఆసక్తి పెంచారు మేకర్స్. ఈ మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
‘మ్యాక్స్'MaxTheMovie:
కన్నడ స్టార్ సుదీప్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘మ్యాక్స్’. వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. విజయ్ కార్తికేయ దర్శకుడు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్స్‌పై కలైపులి ఎస్ థాను నిర్మించారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేస్తోంది.
సారంగపాణి జాతకం (Sarangapani Jathakam):
ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ‘సారంగపాణి జాతకం'. జీవితం మొత్తం మన చేతిలోనే రాసుంటుంది’ అని జాతకాలను గుడ్డిగా నమ్మే సారంగపాణి జీవితంలో.. ఆ అతి నమ్మకం వల్ల ఎలాంటి మార్పులు వచ్చాయనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తెరకెక్కింది. కాగా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న సినిమా విడుదల కానుందని సమాచారం. క్లారిటీ రావాల్సి ఉంది.
షణ్ముఖ (Shanmukha):
ఆది సాయికుమార్, అవికా గోర్ జంటగా షణ్ముగం సాప్పని రూపొందిస్తున్న చిత్రం ‘షణ్ముఖ’. తులసీరామ్, రమేష్ యాదవ్ నిర్మించారు. ఇటీవల షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం.. అన్నీ కుదిరితే డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.