మాకు 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేశ్

మాకు 80కి 80 సీట్లొచ్చినా ఈవీఎంలను నమ్మను : అఖిలేశ్

న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్ లో తమ పార్టీకి 80కి 80 సీట్లు వచ్చినా తాను ఈవీఎంలను నమ్మనని సమాజ్ వాదీ పార్టీ చీఫ్, కనౌజ్  ఎంపీ అఖిలేశ్​​ యాదవ్  అన్నారు. ఈవీఎంల పనితీరుపై తనకు ఇంకా అనుమానాలు ఉన్నాయని, ఆ విషయంపై చర్చ జరగాల్సిందే అని ఆయన డిమాండ్  చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద  తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. తాజాగా ముగిసిన లోక్ సభ ఎన్నికలు దేశంలో మత రాజకీయాలకు అంతం పలికాయని, నైతిక విజయం ఇండియా కూటమిదే అని పేర్కొన్నారు.

ఓటర్ల తీర్పుతో తమ కూటమి బాధ్యత పెరిగిందన్నారు.  అయోధ్య సెగ్మెంట్  ఉన్న ఫైజాబాద్ లో ఓటర్లు విజ్ఞత చూపారని, అక్కడ రాముడు రాసిందే జరిగిందన్నారు.  గత పదేండ్లలో కేంద్ర ప్రభుత్వం సాధించిన ఘనత విద్యా మాఫియా అని విమర్శించారు. నీట్  పేపర్  లీకేజీ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కేంద్రానికి ఇష్టం లేదన్నారు.

ఉద్యోగాలు ఇస్తే, రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుందని, అందుకే పేపర్  లీకేజీలకు కేంద్ర ప్రభుత్వం  సహకరిస్తూ కాలయాపన చేస్తున్నదని  అఖిలేశ్ మండిపడ్డారు.