
పాలమూరు, వెలుగు: జిల్లా కేంద్రంలోని షాలిమార్ ఫంక్షన్ హాల్ లో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ క్యాండిడేట్ వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ అల్లా ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. మైనార్టీ కమిషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, జనరల్ సెక్రటరీ సంజీవ్ ముదిరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆనంద్గౌడ్ పాల్గొన్నారు.