కేసీఆర్‌ స్పీచ్ మిస్ ఐతున్నం.. ఎంపీ ధర్మపురి అర్వింద్

కేసీఆర్‌ స్పీచ్ మిస్ ఐతున్నం.. ఎంపీ ధర్మపురి అర్వింద్

హైదరాబాద్: ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ 24 గంటల రైతు సాధన దీక్ష చేపట్టింది. పార్టీకి చెందిన ఎంపీలు ధర్మపురి అర్వింద్, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్​రెడ్డి, రఘునందన్​రావు, ఈటల రాజేందర్, బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్​కమార్​గౌడ్, ఎమ్మెల్యేలపాటు కీలక నేతలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తామని చెప్పిన రూ. 2 లక్షల రుణమాఫీతో పాటు రైతు భరోసా, రైతు బీమా, వడ్లకు బోనస్ వంటి అంశాలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ALSO READ | ముందు హైడ్రా ఆఫీసును కూల్చండి... ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ... కేటీఆర్

దీక్షలో భాగంగా బీఆర్‌ఎస్‌ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌పై నిజామాబాద్‌ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘రేవంత్‌రెడ్డి.. ఫారిన్​టూర్​లు అక్కర్లేదు.  గజ్వేల్‌లో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఎకరాకు కోటి రూపాయలు సంపాదించారట. ఇది అధ్యయనం చేయడానికి కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు రైతులను పంపించాలని రేవంత్‌కు సలహా ఇస్తున్న. కేసీఆర్‌  ఉద్యమం నడిపినన్ని రోజులు పులి. ఆయన స్పీచ్ మిస్ అవుతున్నాం. పిల్లల మాటలు విని పిల్లి అయ్యారు. కేసీఆర్‌ ఎక్స్‌పైర్‌ అయిన మెడిసిన్‌. జాతిపిత కావాల్సిన కేసీఆర్‌.. పిల్లల అవినీతికి పితగా మారారు’అని అర్వింద్ ఎద్దేవా చేశారు.