కేసీఆర్​, కేటీఆర్​, కవితను బీజేపీ దగ్గరకు రానీయదు... నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​

కేసీఆర్​, కేటీఆర్​, కవితను బీజేపీ దగ్గరకు రానీయదు... నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​
  • కేసీఆర్​, కేటీఆర్​, కవితను బీజేపీ దగ్గరకు రానీయదు
  • కాంగ్రెస్​ పార్టీలోనే బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు విలీనం
  • నిజామాబాద్​ ఎంపీ అర్వింద్​ 

నిజామాబాద్​, వెలుగు: ఎన్నికల్లో గట్టెక్కడానికి అమలు చేయలేని హామీలిచ్చిన సీఎం ఇప్పుడు ప్రతిదానిని వాయిదా వేస్తున్నారని నిజామాబాద్​ఎంపీ అర్వింద్​ ధర్మపురి విమర్శించారు. 2.55 లక్షల మందిలో 30 శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేశారన్నారు. సీఎంగా వైఎస్​రాజశేఖర్​రెడ్డి ఉన్న కాలంలో పాటించిన పద్ధతి ఫాలో కావాలన్నారు.

షరతులులేని మాఫీని అన్నదాతలందరికీ వర్తింపజేయాలని డిమాండ్​ చేశారు. కేసీఆర్​ చేసిన మోసాలు, అబద్ధాలు  గ్రహించే ప్రజలు ఆయన్ను తరిమేశారని ఆయన రంధ్రాలు పడ్డ చిప్పను స్టేట్​కు ఇచ్చివెళ్లారన్నారు. కాగా, రుణమాఫీ కోసం శనివారం ఛలో ఆర్మూర్​ పేరుతో రైతులు తలపెట్టిన ధర్నాకు బీజేపీ తరపున మద్దతు ప్రకటిస్తున్నట్లు అర్వింద్​వెల్లడించారు.  

బీజేపీలో బీఆర్ఎస్​ విలీనం అసాధ్యం

కేసీఆర్, కేటీఆర్, కవితను బీజేపీ దగ్గరకు కూడా రానీయదని అర్వింద్ ​అన్నారు. ఆయా రాజకీయ పార్టీల పక్షాన గెలిచిన ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావాలనుకుంటే మొదట పదవులకు రిజైన్ ​చేసే రావాలన్నారు. బీఆర్ఎస్​ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కొందరు కాంగ్రెస్​లో చేరారని, కాబట్టి బీఆర్​ఎస్​ కాంగ్రెస్​లో విలీనమైనట్లేనని అన్నారు.

ALSO READ : నిమ్స్​లో ఫ్రీ వాటర్​ఏటీఎం ప్రారంభం

రాష్ట్రంలోని ఏ ఎన్నికలు జరిగినా గెలిపించే లీడర్​నే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేయాలన్నారు. పార్టీ స్టేట్​వైస్​ ప్రెసిడెంట్​పల్లె గంగారెడ్డి, మున్సిపల్​ ఫ్లోర్​ లీడర్ ​స్రవంతిరెడ్డి, పోతన్కర్​ లక్ష్మీనారాయణ, పంచరెడ్డి ప్రవళిక, శంకర్, తిరుపతిరెడ్డి ఉన్నారు.