కాంగ్రెస్ లో చేరతానని..ఖర్గేకు కవిత ఫోన్ చేసింది: ఎంపీ అర్వింద్

కాంగ్రెస్ లో చేరతానని..ఖర్గేకు కవిత ఫోన్ చేసింది: ఎంపీ అర్వింద్

కాంగ్రెస్ చేరాతనని ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత  ఫోన్ చేశారని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. తన తండ్రి మీద అలిగిన కవిత కాంగ్రెస్ లో చేరతానని.. మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేశారని అన్నారు.  ఈ విషయం తెలిసిన కేసీఆర్.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చనిపోయినప్పుడు కవితను తన వెంటే లక్నోకు తీసుకెళ్లారన్నారు. తన కూతురు తన వెంటే ఉన్నారని చెప్పేందుకు మీడియా ముందు డ్రామా  ఆడారన్నారు. కవిత, కేటీఆర్ లను తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రాన్ని, కేసీఆర్ ను కేటీఆర్, కవిత  భ్రష్టుపట్టించారన్నారు.

అసలు కవితను ఏ పార్టీ వారైనా కొంటారా అంటూ అర్వింద్ ఎద్దేవ చేశారు.  కవితను కొనేందుకు బీజేపీలో ఎవరైనా ప్రయత్నిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని.. బండి సంజయ్, జేపీ నడ్డాలను డిమాండ్ చేశారు. సెకెండ్ హ్యాండ్ ఎమ్మెల్యేలు బీజేపీకి అవసరం లేదన్నారు. దేశంలోనే సిల్లీ సీఎంగా కేసీఆర్ మిగిలిపోయారని అర్వింద్ అన్నారు. సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితి కేసీఆర్ కి వచ్చిందని విమర్శించారు.

టీఆర్ఎస్ వైఫల్యాలపై కేంద్రం తమను రిపోర్టు ఇవ్వాలని  కోరిందని అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 10 ధర్మల్ పవర్ ప్లాంట్లు పెడతానని చెప్పిన కేసీఆర్.. కేవలం ఒక్కటే మాత్రమే కంప్లీట్ చేశారని అర్వింద్ తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ఇంకా పూర్తికాలేదన్నారు. ఫ్రీ కరెంట్ పేరుతో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫించన్..  కరెంటు బిల్లులకు కూడా సరిపోవడం లేదని విమర్శించారు. 

ప్రజాసమస్యలు, టీఆర్ఎస్ వైఫల్యాలపై అధ్యయన కమిటీ

  • ఎంపీ అర్వింద్:  కమిటీ కన్వీనర్
  • వివేక్ వెంకటస్వామి, జాతీయ కార్యవర్గ సభ్యులు
  • రఘునందన్ రావు,ఎమ్మెల్యే
  • స్వామిగౌడ్, శాసనమండలి మాజీ ఛైర్మన్
  • డి.ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి
  • బాబీ అజ్మీరా, ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు