మెట్ పల్లి, వెలుగు: కోరుట్ల నియోజకవర్గంలో అధికారులకు పోస్టింగ్ లు ఇప్పించేందుకు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు రూ.లక్షలు తీసుకుంటున్నాడని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ఆరోపించారు. శుక్రవారం మెట్ పల్లిలో నిర్వహించిన పసుపు రైతుల కృతజ్ఞత సభకు ఎంపీ హాజరై మాట్లాడారు.
నియోజకవర్గంలో సీఐ పోస్టింగ్ కు రూ.15 లక్షలు, ఎస్సైకు రూ.10 లక్షల చొప్పున వసూల్చేస్తున్నాడని మండిపడ్డారు. దళితబంధు మంజూరుకు రూ.3లక్షలు, సీఎంఆర్ఎఫ్ లో రూ.30వేల చొప్పున నుంచి తీసుకుంటున్నాడని ఆరోపించారు. తాను కోరుట్ల నుంచి పోటీ చేస్తానని, ఎమ్మెల్యే కొడుకు, బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్ భయపడుతున్నాడన్నారు.