గాంధారి(ఎల్లారెడ్డి), వెలుగు: తెలంగాణ అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ఓటేసి గెలిపించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కోరారు. గురువారం ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని గాంధారి టౌన్ లో నిర్వహించిన బీజేపీ కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మంచి నాయకుడైన సుభాష్‌రెడ్డికి టికెట్ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేస్తే, బీజేపీ టికెట్ ఇచ్చి గౌరవించిందన్నారు.
కాంగ్రెస్రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బులకు ఎమ్మెల్యే టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ను గెలిపించడానికే కామారెడ్డిలో పోటీచేస్తున్నారన్నారు. ఉమ్మడి నిజామాబాద్జిల్లాలో 5 సీట్లను కైవసం చేసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని కూడా మోసం చేసిందని అన్నారు.
Also Read :-తాళం కప్పను మింగిన బాలుడు.. ఎండోస్కోపి చేసి బయటకు తీసిన డాక్టర్