కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు దోచుకుంది : ఎంపీ అర్వింద్​

మాక్లూర్, ఆర్మూర్​, వెలుగు: పదేండ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన కల్వకుంట్ల కుటుంబం రూ.లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ ఆరోపించారు. మాక్లూర్ మండలంలోని మామిడిపల్లి, ఆర్మూర్​ మున్సిపల్​ పరిధిలోని మామిడిపల్లి  వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. 

బ్రిడ్జి నిర్మాణ పనుల్లో ఎందుకు డిలే చేస్తున్నారంటూ సంబంధిత ఆఫీసర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్వోబీ నిధులను గత బీఆర్​ఎస్​ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. బ్రిడ్జి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్మూర్ ఎమ్మెల్యీ రాకేశ్​రెడ్డి పాల్గొన్నారు.