
- ఎంపీ అర్వింద్
జగిత్యాల, వెలుగు :నిజామాబాద్ కాంగ్రెస్ క్యాండిడేట్ జీవన్‌రెడ్డి బంగ్లాదేశ్, రోహింగ్యాల క్యాండిడేట్‌గా మాట్లాడుతున్నారని ఎంపీ అర్వింద్ విమర్శించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో శనివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జీవన్‌రెడ్డి మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయన్నారు.
తాను మోదీ సైనికుడినని, భారతీయులు, హిందువుల క్యాండిడేట్‌నని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో రోహింగ్యాల క్యాండిడేట్, హిందూ అభ్యర్థికి నడుమ పోటీ ఉంటుందన్నారు. అనంతరం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫ్యామిలీని పరామర్శించారు.