రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులు ఆలస్యం అవుతున్నాయని ఎంపీ అర్వింద్ అన్నారు. ఇందల్వాయి రైల్వేస్టేషన్లో పాదచారుల వంతెనను ఆయన ప్రారంభించారు. ఇందల్వాయి స్టేషన్కు వందేళ్ల చరిత్ర ఉందని.. పురాతన సంస్కృతికి నిదర్శనమన్నారు. రైల్వే అధికారులు ఇందల్వాయి స్టేషన్ ను అందంగా తీర్చిదిద్దటం గొప్ప విషయమని చెప్పారు. మోడీ హయాంలో రైల్వే పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు.
త్వరలో జిల్లాలో ఉన్న అన్ని రైల్వే లైన్లు విద్యుద్దీకరిస్తామని అర్వింద్ తెలిపారు. మోడీ సూచనలతో దేశవ్యాప్తంగా రైల్వే ఆటోమేషన్ వేగంగా సాగుతుందన్నారు. మోడీ పాలనలో దేశం అభివృద్ధిలో వేగంగా ముందుకుసాగుతోందని తెలిపారు. త్వరలో నిజామాబాద్లో కొత్త రైళ్ల రాకపోకలు ప్రారంభమవుతాయని తెలిపారు. మరో 3 నెలల్లో జిల్లాలోని రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాలు పూర్తవుతాయని.. జిల్లాలోని పలు స్టేషన్లలో గూడ్స్ షెడ్లను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.