నిజామాబాద్ పట్టణంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లను శుక్రవారం(సెప్టెంబర్ 29) ఎంపీ అర్వింద్ పరిశీలించారు. అక్టోబర్ 3వ తేదీన ప్రధాని మోదీ నిజామాబాద్ రాబోతున్నారని తెలిపారు. గిరిరాజ్ కళాశాల మైదానంలో లక్ష మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు.
8 వందల మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్ట్‌కు వర్చువల్‌గా ప్రారంభించనున్నారని చెప్పారు. మోదీ పర్యటన తర్వాత అమిత్‌షా, నడ్డా పర్యటనలు ఉంటాయని వివరించారు.
షెడ్యూల్ ఇదే ..
అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకి హైదారాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి మోదీ రానున్నారు. -1:45 నుంచి 2.15 వరకు హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటారు. 3.05 గంటలకు మహబూబ్ నగర్.. 3.15 నుంచి 4.15 వరకు బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.
నిజామాబాద్‌లో అక్టోబర్ 3న రాష్ట్ర బీజేపీ నాయకత్వం నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొంటారు. పసుపు బోర్డును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
ALSO READ: బీజేపీతో బీఆర్ఎస్ చేతులు కలిపింది: జీవన్ రెడ్డి
శంకుస్థాపన, జాతికి అంకితం చేయనున్న కార్యక్రమాలు
• నాగ్‌పూర్- విజయవాడ ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించి రూ. 6400 కోట్ల విలువైన రోడ్డు ప్రాజెక్టులు శంకుస్థాపన
• హైదరాబాద్-విశాఖపట్నం కారిడార్‌కు సంబంధించిన NH- 365BB రహదారి ప్రాజెక్ట్‌లో 59 కి.మీ పొడవు గల సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు నాలుగు లేనింగ్‌లకు రూ. 2460 కోట్ల భారతమాల పరియోజన కింద అభివృద్ధి చేయబడిన రహదారి ప్రారంభోత్సవం.
• రూ. 500కోట్లు - ‘37 కి.మీల జక్లెయిర్ – కృష్ణా కొత్త రైల్వే లైన్’ శంకుస్థాపన
• కర్ణాటకలోని హాసన్ నుండి చెర్లపల్లి వరకు ఆయిల్ అండ్ గ్యాస్ పైప్‌లైన్ ప్రాజెక్టుకు రూ. 2710 కోట్ల శంకుస్థాపన మరియు అంకితం
• కృష్ణపట్నం నుండి హైదరాబాద్ (మల్కాపూర్) వరకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) ₹1940cr‘మల్టీ-ప్రొడక్ట్ పెట్రోలియం పైప్‌లైన్ శంకుస్థాపన
• హైదరాబాద్ విశ్వవిద్యాలయం యొక్క ఐదు కొత్త భవనాలను మోదీ ప్రారంభించనున్నారు. (స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్స్కూ ల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ & స్టాటిస్టిక్స్, స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్, లెక్చర్ హాల్ కాంప్లెక్స్, సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ & కమ్యూనికేషన్).