అమిత్ షాతో ఎంపీ అర్వింద్ భేటీ

  • నిజామాబాద్ స్థానాలపై చర్చ

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే ఎన్నికల్లో నిజామాబాద్ లోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిచి క్లిన్ స్వీప్ చేసే అంశంపై కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చించినట్లు ఎంపీ ధర్మపురి అర్వింద్ వెల్లడించారు. సోమవారం ఆయన ఢిల్లీలో అమిత్ షాను కలిశారు. 

దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో తెలంగాణ ప్రస్తుత రాజకీయ అంశాలపై చర్చించినట్లు అర్వింద్ ట్వీట్ చేశారు. ముఖ్యంగా నిజామాబాద్​లోని 7 అసెంబ్లీ స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసే వ్యూహంపై ముచ్చటించినట్లు వెల్లడించారు.