మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎంపీ అర్వింద్ సవాల్

నిజామాబాద్: ఇంటికో ఉద్యోగం హామీ ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఎంపీ అర్వింద్. ఉద్యోగాల విషయంలో చర్చకు రావాలని మంత్రి ప్రశాంత్ రెడ్డికి సవాల్ విసిరారు. నిజామాబాద్ మాధవనగర్ ROBకి నిధులు మంజూరు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు అర్వింద్. 8 ఏళ్ల క్రితం ప్రారంభం కావాల్సిన పనులు.. తమ పోరాటంతో ఇప్పుడు ప్రారంభం అవుతున్నట్లు చెప్పారు. ఏడాదిలోగా పనులు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్లను వేధించకుండా, అవినీతికి తావీయకుండా పనులు వేగవంతం చేయాలన్నారు. 
కరీంనగర్ కేంద్రంగా 50శాతం రీసైకిలింగ్
కరీంనగర్ కేంద్రంగా 50 శాతం రీ సైకిలింగ్ దందా నడుస్తోందని ఎంపీ అర్వింద్ ఆరోపించారు. ఆధారాలు, అవగాహన లేకుండా తనపై అట్రాసిటీ కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పన విషయం లో  వివరాలతో రండి చర్చకు తాను సిద్ధమే నంటూ మంత్రి ప్రశాంత్ రెడ్డి కి సవాల్ విసిరారు.

 

 

ఇవి కూడా చదవండి

317GO సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ఐసీసీ టీ20 బెస్ట్ ప్లేయర్గా పాక్ ఆటగాడు

సయ్యద్ మోదీ టోర్నీలో పీవీ సింధు విజయం