
మనీష్ సిసోడియా ఈ పేరు ఢిల్లీ పాలిటిక్స్ లో చాలా పాపులర్. ఆప్ సర్కార్ హయాంలో డిప్యూటీ సీఎంగా కీలక నేతగా ఉన్న సిసోడియా లిక్కర్ స్కాంలో జైలుపాలైన సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీలోని జంగ్ పూర అసెంబ్లీ నుంచి పోటీ చేసిన సిసోడియా 600 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. సమీప బీజేపీ ప్రత్యర్థి తర్వింధర్ సింగ్ చేతిలో ఓడిపోయాడు.
అయితే సిసోడియా ఓటమిలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింత్ కీలక పాత్ర పోషించారు. జంగ్ పూర నియోజకవర్గానికి ఇన్ చార్జ్ గా ఉన్న అర్వింద్..బీజేపీ అభ్యర్థి తర్విందర్ సింగ్ గెలుపులో కీ రోల్ ప్రకటించారు. అంతేగాకుండా అర్వింద్ ఇన్ చార్జ్ గా ఉన్న మరో నియోజకవర్గం ఆర్ కే పురంలో బీజేపీ అభ్యర్థి అనిల్ శర్మ కూడా విజయం సాధించారు.
తాను ఇన్ చార్జ్ గా ఉన్న రెండు నియోజకవర్గాల్లో బీజేపీ గెలుపొందటంతో ఎంపీ అర్వింద్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రచారంలో సహకరించిన నిజామాబాద్ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగించింది. మొత్తం 70 కి పైగా అసెంబ్లీ స్థానాలకు బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మ్యాజిక్ ఫిగర్ ను దాటి 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టబోతుంది.