నిజామాబాద్: తండ్రి డి. శ్రీనివాస్ రాజకీయ నిర్ణయాలతో తనకెలాంటి సంబంధంలేదని బీజేపీ నేత, ఎంపీ అర్వింద్ స్పష్టం చేశారు. నిజామాబాద్లో టీఆరెస్ కార్యకర్తల దాడిలో గాయపడ్డ పత్రిక రిపోర్టర్ ని పరామర్శించిన అనంతరం మీడియాలో మాట్లాడిన ఆయన.. ఏ పార్టీలో చేరాలన్నది డీఎస్ సొంత నిర్ణయమని అన్నారు. డీఎస్ ఏ పార్టీలో చేరినా సంతోషమేనని, బీజేపీలో చేరితే మరింత ఆనందపడతానని చెప్పారు. డీఎస్ అనుమతితో తాను బీజేపీలో చేరలేదన్న అర్వింద్.. తాను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటానని చెప్పారు. తన తండ్రి గతంలో కాంగ్రెస్ ను వీడి తప్పుచేశానని బాధపడ్డారని, ఇప్పుడు తిరిగి ఆ పార్టీలోకి వెళ్లాలనుకుంటున్నారని అన్నారు. డీఎస్ కాంగ్రెస్వాదిగానే ప్రజలకు తెలుసని, ఆయన తిరిగి ఆ పార్టీలో చేరితే తెలుగు రాష్ట్రాల కార్యకర్తలు సంతోషిస్తారని అర్వింద్ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి..