లోక్ సభ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాం : అర్వింద్

లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో క్లీన్ స్వీప్ చేస్తామన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్. ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్నారు.   నిజామాబాద్ నుంచి ప్రధాని మోదీ పోటీ చేస్తే ఆహ్వానిస్తానన్నారు.   లిక్కర్ కేసులో కవితపై వచ్చిన ఆరోపణలు రుజువైతే  జైలుకు పంపిస్తామన్నారు.  హిందువులపై కామెంట్లు చేసిన కల్వకుంట్ల కుటుంబాన్ని ప్రజలు గద్దె దించారన్నారు. ఎన్నికల సమయంలో  మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఓటుకు ఐదు వేలు పంపిణీ చేశారని ఆరోపించారు అర్వింద్. 

అసంపూర్తిగా ఉన్న ఆర్ఓబి పనుల కోసం  రాష్ట్ర  రోడ్డు భవనాల శాఖ మంత్రిని, ఆర్మూర్ ఎమ్మెల్యేలను  కలుస్తామని చెప్పారు అర్వింద్. ఆర్ఓబి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డిపాజిట్ చేసిన రూ.15 కోట్లను నిధులను గత ప్రభుత్వం దుర్వినియోగం చేసి ఎన్నికల్లో ఖర్చు చేసిందన్నారు.  అడవి మామిడిపల్లి ఆర్వోబి పనుల కోసం డిపాజిట్ చేసిన రూ.15 కోట్లు అప్పటి ప్రభుత్వం ఇతర అవసరాలకు ఉపయోగించినట్లు అధికారులు ఒప్పుకున్నారని చెప్పారు.