ఎంఐఎం పార్టీ దేశానికి పట్టిన క్యాన్సర్ లాంటిదని అన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.వక్ఫ్ బోర్డ్ చట్టం దుర్మార్గపు చట్టమని విమర్శించారు. పార్లమెంటు చట్టాలను ఉల్లంగిస్తే ఎంఐఎంపై కఠిన చర్యలకు సిద్ధమని అన్నారు.
ఎన్నికల సమయంలో రేవంత్.. దేవుళ్ళ మీద ఓట్టేసి రైతులను నట్టేటా ముంచారని ధ్వజమెత్తారు అర్వింద్. హిందూదేవుళ్ళ మీద ఒట్టేసిన రేవంత్.. ముస్లిం దేవుళ్ళ మీద ఎందుకు ఒట్టేయ్యలేదని ప్రశ్నించారు. 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్ హామీ ఏమైంది? ఆరు గ్యారెంటీలు కూడా అమలు చేయలేదని.. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదన్నారు. కాంగ్రెస్ కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలన గాడి తప్పిందన్నారు అర్వింద్.
ALSO READ : వక్ఫ్ భూములు ఆక్రమించి ఇల్లు కట్టారు..ముఖేష్ అంబానీపై అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ గాల్లో లెక్కలేసి పాలన చేసిందని.. కాంగ్రెస్ అదే దారిలో నడుస్తుందని విమర్శించారు అర్వింద్. కేటీఆర్ పాదయాత్ర హాస్యాస్పదమన్నారు కేటీఆర్ పాదయాత్ర చేస్తే చీపుర్లు, చెప్పులతో తరిమి కొట్టాలన్నారు. కేటీఆర్ ది పాదయాత్రనా? లేక పదవుల యాత్రానా? స్పష్టం చేయాలన్నారు. బీఅర్ ఎస్ చేసిన అఘాయిత్యాలు ప్రజలు మరవలేదని చెప్పారు.