పసుపు బోర్డుతో నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది : ఎంపీ అర్వింద్

నిజామాబాద్ : ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత ముందు చూపు ఉన్న ఏకైక ప్రధాని మోదీయే అని చెప్పారు. పసుపు రైతుల కోరిక నెరవేర్చిన మోదీకి ధన్యవాదాలు తెలిపారు. పసుపు బోర్డుతో తన పని ఇంతటితో అయిపోయిందని అనుకోవట్లేదని, తన ప్రయాణం ఇప్పుడే మొదలైందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి ముసళ్ల పండగ ముందుందన్నారు. 

ALSO READ: పసుపు రైతుల కల నెరవేర్చిన ఘనత మోదీదే : డీకే అరుణ

మంత్రి కేటీఆర్ దిక్కుమాలిన వ్యక్తి అని కామెంట్స్ చేశారు ఎంపీ అర్వింద్. కేటీఆర్ మత్తులో మునిగి తెలుతున్నారని ఆరోపించారు. 2017 నుండి ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ ఇంకా కేంద్రానికి ఇవ్వలేదన్నారు. పాలమూరు, కాళేశ్వరం జాతీయ హోదా అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. ఇందూరు వేదికగా ప్రధాని మోదీ వేల కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారని చెప్పారు. గల్ఫ్ కార్మికుల సమస్యలను బీజేపీ పార్టీనే పరిష్కరిస్తుందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని బీజేపీ తెరిపిస్తుందన్నారు. జక్రాన్ పల్లిలో ఎయిర్ పోర్టును కేటాయిస్తే గాలికొదిలేశారని ఆరోపించారు.