ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

నిజామాబాద్, వెలుగు: గల్ఫ్​ బాధితులకు అండగా ఉంటానని ఎంపీ అర్వింద్​ అన్నారు.   ఫారెన్​ వీసాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 80 మంది మలేషియాలో చిక్కుకుపోగా.. వారితో ఎంపీ అర్వింద్​ శుక్రవారం ఫోన్​లో మాట్లాడారు. తాము విజిటింగ్​ వీసా మీద మలేషియా వెళ్లగా.. అక్కడి అధికారులు పట్టుకున్నట్టు ఎంపీకి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ వారితో మాట్లాడుతూ..   వారిని ఇండియా తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. కౌలాలంపూర్ లోని ఇండియన్ హై కమిషనర్ బి.ఎన్ రెడ్డి తో చర్చించారు. ఏజెంట్ల మోసాల బారిన పడకుండా వీసాల తీసుకునే సమయంలో జాగ్రతపడాలని సూచించారు. 
 

బీడీ కార్మికులను మోసం చేస్తున్న ప్రభుత్వాలను ఓడించాలె

కామారెడ్డి, వెలుగు: బీడీ కార్మికులను మోసం చేస్తున్న ప్రభుత్వాలను గద్దె దిగాలని సీఐటీయూ కేంద్ర కమిటీ సభ్యుడు సాయిబాబా, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారావు పిలుపునిచ్చారు. శుక్రవారం బీడీ, సిగార్​ వర్కర్స్​ యూనియన్​ రాష్ట్ర మహసభలు కామారెడ్డి జిల్లాలో నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్​ ఆఫీసు నుంచి ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత బీడీ కార్మికుల జీవనోపాధి దెబ్బ తీసేందుకు చట్టాలను తీసుకు వస్తోందన్నారు. సిగరేట్​ కంపెనీలను, బీడీ కంపెనీల యజమానులను ప్రొత్సహించి ఇతర రంగాలకు మళ్లించి, కార్మిక వర్గాలకు నష్టాలను తీసుకువస్తుందని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనాలు రూ. 26 వేలు , పింఛను రూ. ఆరు వేలు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో బీడీ, సిగార్​ వర్కర్స్​ యూనియన్​ స్టేట్​ ప్రసిడెంట్​ నాగారపు ఎల్లన్న, జనరల్​ సెక్రెటరీ ఎస్​. రమ, డిస్టిక్​ ప్రసిడెంట్​ చంద్రశేఖర్​, స్టేట్​ లీడర్లు నూర్జహన్​ నాయకులు వెంకట్​గౌడ్, సురేశ్​​గొండ, భాస్కర్​, రాజనర్సు, మహబూబ్, సంతోష్​ తదితరులు పాల్గొన్నారు.

శక్కర్​ నగర్​లోనే అంబేద్కర్​ భవనం కట్టాలి
 దళిత ఐక్యవేదిక నాయకులు డిమాండ్​

బోధన్​, వెలుగు: అంబేద్కర్​ భవనం శక్కర్​నగర్​లో కేటాయించిన స్థలంలోనే అంబేద్కర్​ భవనం కట్టాలని దళిత ఐక్యవేదిక నాయకులు డిమాండ్​ చేశారు. పట్టణంలోని అంబేద్కర్​ చౌరస్తాలో శుక్రవారం వారు నిరసన తెలిపారు. ఈసందర్భంగా మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు ఆనంపల్లి ఎల్లయ్య, బీఎస్పీ నియోజకవర్గ ఇన్​చార్జి సింగారి పాండు మాట్లాడారు. మాజీ మంత్రి సుదర్శన్​రెడ్డి ఉన్నా సమయంలోనే ఎన్ఎస్​ఎఫ్​ కోర్​ కమిటి సభ్యులు ప్రపోజల్స్​ పంపిస్తే.. ఆభూమిని అంబేద్కర్​ భవన్​కు కేటాయించడంతో పాటుగా రూ.50లక్షలు మంజూరు అయ్యాయని తెలిపారు. ఆస్థలంలోనే అంబేద్కర్​ భవనం కట్టాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే షకీల్​ కు ఆస్థలంలో భవన నిర్మాణం చేపట్టాలని ఇష్టం లేకనే మార్కెట్​ నిర్మాణానికి కేటాయించినట్లు ఆరోపించారు. ఆస్థలం కేటాయించేవరకు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్యవేదిక నాయకులు ఖజాపూర్​ మాజీ ఎంపీటీసీ శంకర్, ఎడపల్లి మోహన్​, కాశీరాం, మల్లు కిరణ్​, వివిధ మండలాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. 

అధికారులు అంకితభావంతో పని చేయాలె

నిజామాబాద్, వెలుగు: ప్రభుత్వ పథకాల ను అమలు చేయడంలో అధికారులు అంకి త భావంతో పని చేయాలని కలెక్టర్ సి.నారా యణరెడ్డి అన్నారు. న్యూ కలెక్టరేట్​లో శుక్ర వారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటి వెలుగు, మన ఊరు– -మన బడి, హరిత హారం, తెలంగాణా క్రీడా ప్రాంగ ణాలు, డబుల్​ ఇండ్లు, కొత్త ఓటర్లు, ధరణి అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 18 ఏండ్లు  నిండిన అందరికీ కంటి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జనాభా వివరాల ఆధారంగా పీహెచ్సీలు,యూపీహెచ్సీల వారీగా సమగ్ర ప్రణాళికను తయార చేయాల న్నారు. కంటివెలుగు గడువులోపు నూరు శాతం పూర్తిచేయాలన్నారు. మన ఊరు - మన బడి స్కీమ్​ తో కార్పొరేట్ సంస్థలకు దీటుగా సర్కార్​ బడులు మారాలన్నారు. మొదటి విడత 114 పాఠశాలల్లో మంజూరైన పనులన్నీ ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించారు. వారం రోజుల వ్యవధిలో స్థల కేటాయింపు జరిగిన 393 ప్రదేశాల్లోనూ తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు కావాల్సిందేనని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరెన్సులో అడిషన్​ కలెక్టర్లు బి.చంద్రశేఖర్, చిత్రామిశ్రా, డీఆర్డీఓ చందర్, డీ ఎం హెచ్ ఓ డాక్టర్ సుదర్శన్, ఆయా శాఖల జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

రూ. లక్ష రుణమాఫీని వెంటనే అమలు చేయాలి

నందిపేట, వెలుగు : రైతులకు రూ. లక్ష రుణమాఫీ ని వెంటనే అమలు చేయాలని  డిమాండ్​ చేస్తూ శుక్రవారం బీజేపీ నాయకులు తహసీల్దార్ ఆఫీస్​ ఎదుట కిసాన్​ మోర్చా నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం మండల అధ్యక్షులు చిన్నారెడ్డి మాట్లాడుతూ.. వడ్లు కొనుగోలు చేసి నెలలు గడుస్తున్నా రైతులకు ఇంకా డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ధరణి పోర్టల్ తో ఎంతో మంది రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, దాన్ని సమీక్షించి రైతుల న్యాయం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్​ బీమా ను తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్​ చేశారు. అనంతరం తహసీల్దార్​ అనిల్​కుమార్​ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్​మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు సంజీవ్, నాగ సురేశ్, తారక్​, నరేందర్​ పాల్గొన్నారు. 

మహిళ శక్తి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

భోధన్​,వెలుగు: మహిళ శక్తి కేంద్రాలు, సఖీ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సఖీ కేంద్రం లీగల్​ అడ్వైజర్​ లావణ్య సూచించారు. పట్టణంలోని రిలియన్స్​ మార్ట్​లో పనిచేసే మహిళలకు శక్రవారం అవగాహన కల్పించారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ.. హింసా వ్యతిరేక దినోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులకు ఎదుర్కొంటే సమాచారం ఇవ్వాలని చెప్పారు. సఖీ కేంద్రంలో నివాస సౌకర్యాం, కౌన్సిలింగ్, వైద్య, న్యాయపరమైన, పోలీస్​ సౌకర్యాలు అందిస్తుందని తెలిపారు. మహిళల సమస్యల పరిష్కారానికి మహిళ హెల్ప్​లైన్​ 181, చైల్డ్​ హెల్ప్​లైన్​ 1098, వయో వద్దుల హెల్ప్​లైన్​14567 నెంబర్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళ సంక్షేమ అధికారి స్వప్న, సూపర్​ వైజర్ ఆసీయా, రిలియన్స్​ మార్ట్​ మహిళ సిబ్బంది పాల్గోన్నారు.