- బీజేపీ ఎంపీ అర్వింద్
నిజామాబాద్, వెలుగు : లిక్కర్‌స్కామ్ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నోటీసు రావొచ్చని బీజేపీ ఎంపీ అర్వింద్ అన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఇప్పటికే నాలుగు సార్లు నోటీసులు వచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. జైలుకు ఎవరు వెళ్తారో కూడా త్వరలో తేలిపోతుందని చెప్పారు. గురువారం నిజామాబాద్ జిల్లా పార్టీ ఆఫీస్‌లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఈడీ తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని, ఎవరి జోక్యం ఉండదన్నారు.
ఈ నెల 22న అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభోత్సవంతో 500 ఏండ్ల హిందూ జాతి కల నెరవేరబోతోందని తెలిపారు. ఈ నెల 22న ప్రతి ఇంట్లో రామజ్యోతులు వెలిగించాలని పిలుపునిచ్చారు. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్‌లో చూసే విధంగా ఏర్పాటు చేసిన పట్టణంలోని ప్రాచీన ఖిల్లా రామాలయాన్ని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి అర్వింద్ క్లీన్ చేశారు.