తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. కామారెడ్డి జిల్లాలోని ఆర్యసమాజ్ లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తూ చేపట్టిన మృత్యుంజయ హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు అర్వింద్. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఏడున్నరేళ్లలో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని అన్నారు. అలాంటి వ్యక్తిని నడిరోడ్డుపై 20 నిమిశాల పాటు ఉంచిన ఘటనపై పంజాబ్ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి..బాధ్యులైన వారిని బయటకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. భగవంతుని ఆశీస్సులు ప్రధాని మోడీకి ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.
రాష్ట్రంలో రైతు వారోత్సవాల్లో టీఆర్ఎస్ నేతలు తప్ప రైతులు లేరన్నారు అర్వింద్.2 వేల పింఛన్ ఇచ్చి ప్రజలను జీవితం గడపమంటున్నారని, 10 వేలు తీసుకుని కేసీఆర్ ఫోటో పెట్టుకొమ్మంటున్నాడన్నారు. అకాల వర్షాలకు పసుపు రైతులు ఆగమయ్యారని, ఇప్పటికీ ప్రత్యామ్నాయ పంటలపై పటిష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు. రైతులు లక్షల్లో నష్టపోతే 10 వేల రూపాయలు ఇచ్చి సంబరాలు చేసుకొమ్మంటున్నారని అన్నారు.
మూడేళ్ళ క్రితం కేంద్రం చెప్తే మూడు గంటల్లో 317 GO తెచ్చారన్న అర్వింద్..317 GO కేసీఆర్ కు కూడా అర్థం అయిందో లేదో కూడా తెలియదన్నారు. ఏమన్నా అంటే అరెస్టులు,వారెంట్లు అంటున్నారు.. నన్నెందుకు అరెస్ట్ చేస్తారు.. నేనేమైన రౌడీ షీటర్ నా అంటూ ప్రశ్నించారు. దొంగ FIR లతో కేసులు చేస్తున్నారు. FIR లు అతిగా ఉన్నాయని కోర్టులతో పోలీసు శాఖకు చెప్పే పరిస్థితి ఏర్పడిందన్నారు.
మరోవైపు కేంద్రం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని అంటూ ఎమ్మెల్సీ కవిత చేసిన ట్వీట్ పై తీవ్రంగా స్పందించారు ఎంపీ అర్వింద్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కవిత ఎంపీగా ఉన్న సమయంలో 54 వేల మందికి స్వయం ఉపాధి కింద కేంద్రం ఋణాలిచ్చిందన్నారు. నీ అయ్య ఎంతమందికి ఉద్యోగాలిచ్చారు.. ఎన్ని ఋణాలిచ్చారు.. ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పాలంటూ కౌంటర్ ఇచ్చారు. నువ్వేం ఘనకార్యం చేశావని నీకు ఎమ్మెల్సీగా ఉద్యోగం ఇచ్చాడో ముందు సమాధానం చెప్పు అని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలతో కూడా చర్చలు జరిపేందుకు దిగజారిపోయింది టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. చివరకు కమ్యూనిస్టు పార్టీ కూడా ఛీ కొట్టే స్థితికి కేసీఆర్ జీవితం చేరిందన్నారు. ఇంకెంతమంది ఆత్మహత్య చేసుకోవాలి.. ఎంత మంది జీవితాలను నాశనం చేస్తావ్ కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు చేసిన ధౌర్భాగ్య పాలనకు తలదించుకుని నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అని అన్నారు అర్వింద్.
మరిన్ని వార్తల కోసం...