వడ్లు కొనేది లేదని కేంద్రం ఎక్కడా చెప్పలే

వడ్లు కొనమని కేంద్రం ఎక్కడా చెప్ప​లేదన్నారు బీజేపీ ఎంపీ అర్వింద్.బాయిల్డ్ రైస్ మాత్రమే కేంద్రం వద్దని చెప్పిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి సాగుపై ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవరిస్తోందన్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ ఆఫీసులో మాట్లాడిన ఆయన.. 8 ఏళ్లలో ప్రజలకు కేసీఆర్ చేసిన మేలు ఏమీ లేదన్నారు. రాష్ట్రంలో అడ్వాన్స్ డ్ మిల్లులు ఎక్కడా లేవన్నారు. మిల్లుల దగ్గర 20 శాతం కమీషన్ తీసుకుంటున్నారని విమర్శించారు. 8 ఏళ్లలో ఎవరికీ బోనస్ ఇవ్వలేదన్నారు. హుజురాబాద్ కలెక్టర్ వరి విత్తనాలు అమ్మోద్దంటే..గంజాయి విత్తనాలు అమ్మాల్నా అని ప్రశ్నించారు. 


అధికారులు బానిస బతుకులు కాకుండా..ప్రజలకు కొంచెమైనా మేలు చేయండి అని అన్నారు. వరి వద్దంటున్న సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ఎందుకు కడుతున్నారో చెప్పాలన్నారు. 


పండించిన ప్రతి గింజనుకొంటానన్న కేసీఆర్ ఎందుకు మాట్లాడడు? తెలంగాణ బ్రాండ్ తో బియ్యాన్ని మార్కెటింగ్ చేస్తామన్న కేసీఆర్ ఎక్కడ అని అన్నారు. మంత్రి గంగుల కమలాకర్, హరీశ్ వడ్లను కొంటానంటే..  జగదీష్ రెడ్డి కొనమంటున్నారు. ప్రజలు ఎవరి మాటలు నమ్మాలో చెప్పాలన్నారు.

వండ్లు కొనమని కేంద్రం చెప్పలేదని.. దీనిపై ఆరోపణలుచేస్తున్న..  మంత్రి  నిరంజన్ రెడ్డి తో చర్చించేందు కు తాను సిద్ధమన్నారు అర్వింద్.ప్రగతి భవన్ కు రమ్మన్న వస్తా.. తెలంగాణ భవన్ కు రమ్మన్న వస్తానని సవాల్ విసిరారు.