దోపిడీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి ధర్మపురి అర్వింద్. బ్రిటీష్ వాళ్ల కంటే ఎక్కువ దోపిడీ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజలు ప్రశ్నిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ అంటేనే కరప్షన్ భూమి మీదనే కాదు ఆకాశంలో కూడా స్కామ్ లు చేశారని ఆరోపించారు. మోడీది అవినీతి రహిత పాలన .. మోడీ పాలనపై అవినీతి ఆరోపణలు చేయడం అర్ధరహితమన్నారు.
దేశంలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధే బీజేపీని గెలిపిస్తుందన్నారు. ముచ్చటగా మూడోసారి మోదీయే ప్రధాని కావడం ఖాయమన్నారు. కేంద్రంలో బీజేపీ ఉండాలని ప్రజలంతా డిసైడయ్యారన్నారు. నిజామాబాద్ అర్భన్ లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు అర్వింద్.