జగిత్యాల అసెంబ్లీనీ బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం : అర్వింద్

ఎన్నికలు దగ్గరికి వస్తే బీఆర్ఎస్ ప్రభుత్వానికి దడ పుడుతోందన్నారు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. అందుకే రైతులపై అన్యాయంగా కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

మార్చిలో టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీని  ఖండిస్తూ  చేపట్టిన కలెక్టరేట్ ముట్టడిలో పాల్గొన్న బీజేపీ నాయకుడు పన్నాల తిరుపతిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా  తిరుపతి కుటుంబ సభ్యులను అర్వింద్ వారి ఇంటికెళ్లి పరామర్శించారు.  బీజేపీ  నాయకులపై కేసులు పెట్టాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మాజీ ఎంపీ కవిత పోలీసులపై ఒత్తిడి పెడుతున్నారని ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని చెప్పారు.  ఎంపీగా జేపీ తరపున దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జగిత్యాలలో బీజేపీ  జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.