అధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం: ఎంపీ అర్వింద్

జగిత్యాల: బీజేపీ అధికారంలోకి రాగానే నిజాం షుగర్ ఫ్యాక్టరీని  ప్రారంభిస్తామన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్.  మల్లాపూర్ మండలం సిర్పూర్ లో బీజేపీ మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఎంపీ అర్వింద్. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధాన్యం కొనుగోళ్లో  కేసీఆర్ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. క్వింటా కు 10 కిలోల కోత పెట్టి ధాన్యం కొనుగోలు చేశారని అన్నారు. రీసైక్లింగ్ బియ్యం మాఫియా నడుపుతూ కోట్లు గడించారని అన్నారు ధర్మపురి అరవింద్. బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల నుంచి గింజ తరుగు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. 

 ఎంపీగా గెలిచిన వెంటనే పసుపు తెస్తానని బాండ్ రాసిన ప్రకారం.. పసుపు బోర్డు తీసుకొచ్చానన్నారు ఎంపీ అర్వింద్.. ప్రధానీ మోదీ వల్లే పసుపుబోర్డు సాధ్యమైం దన్నారు. ఉత్తరప్రదేశ్ లో మూతపడ్డ షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించాం.. ఇక్కడకూడా నిజాం షుగర్ ఫ్యాక్టరినీ అధికారంలోకి రాగానే ప్రారంభిస్తాం..చెరుకు పంటకు మద్దతు ధర ఇచ్చి ఫ్యాక్టరీలను నడుపుతామన్నారు ఎంపీ ధర్మపురి అర్వింద్.