వచ్చే ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పోటీచేస్తం: అసదుద్దీన్​ ఒవైసీ

  • రాష్ట్రంలో మా పార్టీ కూడా ప్రత్యామ్నాయమే: అసద్
  • ముస్లిం బంధు అమలు చేయాలని కేసీఆర్​ను కోరినా స్పందించలే​
  • బీఆర్ఎస్​తో గుడ్​ రిలేషన్​ ఎక్కడని ప్రశ్న

నిజామాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పోటీచేసి సత్తా చాటుతామని మజ్లిస్​ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తాము కూడా ప్రత్యామ్నాయమే అని ఆయన పేర్కొన్నారు. అంతిమంగా గెలుపోటములు డిసైడ్​ చేసేది ప్రజలే అని చెప్పారు. ముస్లిం బంధు అమలు చేయాలని సీఎం కేసీఆర్​ను కోరినా స్పందించ లేదని తెలిపారు. జిల్లా జైలులో రిమాండు ఖైదీలుగా ఉన్న బోధన్​ ఎంఐఎం లీడర్లతో సోమవారం ఆయన ములాఖాత్​ అయ్యారు. 

తనపై హత్యాయత్నం చేశారని అక్కడి ఎమ్మెల్యే షకీల్  ఇచ్చిన కంప్లైంట్​ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారం కింద ఎంఐఎం లీడర్లను జైలుకు పంపిన సంగతి తెలిసిందే. జైలులో వారిని కలిసిన తర్వాత మీడియాతో ఒవైసీ మాట్లాడారు. ‘‘కవిత, షకీల్​ గెలుపు కోసం మా వాళ్లు రాత్రింబవళ్లు కష్టపడ్డరు. బీఆర్ఎస్​ను ఫ్యామిలీగా భావించాం. చివరకు మా వాళ్లపై 307 సెక్షన్​కేసులు పెట్టి జైళ్లకు పంపినరు. ఇక బీఆర్ఎస్​తో మంచి సంబంధాలు ఎక్కడున్నట్టు?’’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు.

మా బ్యాటింగ్​ మేమే చేస్తం

అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని బీఆర్ఎస్​ లీడర్లు మరిచిపోతున్నారని అసదుద్దీన్​ అన్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి ఇప్పటివరకు ఏమీ ఆలోచించలేదని, ఎవరితో జట్టు కడతామనేది మున్ముందు తెలుస్తుందన్నారు. ‘‘మా బ్యాటింగ్​మేమే చేస్తం. స్కోర్​చూసుకుంటాం. ఆపై ఎవరిని అవుట్​ చేయాలో నిర్ణయిస్తం. మజ్లిస్​పోటీ చేసే స్థానాలను త్వరలో ప్రకటిస్తం” అని ఒవైసీ చెప్పారు. అలాగే వచ్చే లోక్​సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఎంపిక స్థానాల నుంచి పోటీచేస్తామని ఆయన తెలిపారు. ఇక, బీఆర్ఎస్​ విస్తరణ కోసం సీఎం కేసీఆర్​ చేస్తున్న ప్రయత్నాలపై  స్పందిస్తూ.. కేసీఆర్​ భారత పౌరుడని, ఆయన ఎక్కడికైనా వెళ్లొచ్చని వ్యాఖ్యానించారు. 

ALSO READ:రూ.23 వేల కోట్ల.. పన్ను ఎగ్గొట్టిన శ్రీసిమెంట్స్! ఏటా రూ.1,400 కోట్లు..

మోదీ మరోసారి ప్రధాని కావద్దనేదే మా టార్గెట్​

2024లో మూడోసారి కూడా నరేంద్ర మోదీ ప్రధాని కాకూడదన్నదే తమ లక్ష్యమని అసదుద్దీన్​ అన్నారు. ఈ విషయంలో తమతో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని వెళ్తామని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా రెండు రోజుల కింద పాట్నాలో ప్రతిపక్షాలు నిర్వహించిన మీటింగ్ కు తనకు ఆహ్వానం అందలేదని వెల్లడించారు. ఇందుకు కారణాలు తెలియవన్నారు.

ముస్లిం బంధు అమలు చేయాలని కేసీఆర్​ను కోరినా స్పందించలే​

బీఆర్ఎస్​తో గుడ్​ రిలేషన్​ ఎక్కడని ప్రశ్న

  • నిజామాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో పోటీచేసి సత్తా చాటుతామని మజ్లిస్​ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్​ ఒవైసీ అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో తాము కూడా ప్రత్యామ్నాయమే అని ఆయన పేర్కొన్నారు. అంతిమంగా గెలుపోటములు డిసైడ్​ చేసేది ప్రజలే అని చెప్పారు. ముస్లిం బంధు అమలు చేయాలని సీఎం కేసీఆర్​ను కోరినా స్పందించ లేదని తెలిపారు. జిల్లా జైలులో రిమాండు ఖైదీలుగా ఉన్న బోధన్​ ఎంఐఎం లీడర్లతో సోమవారం ఆయన ములాఖాత్​ అయ్యారు. తనపై హత్యాయత్నం చేశారని అక్కడి ఎమ్మెల్యే షకీల్  ఇచ్చిన కంప్లైంట్​ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వారం కింద ఎంఐఎం లీడర్లను జైలుకు పంపిన సంగతి తెలిసిందే. జైలులో వారిని కలిసిన తర్వాత మీడియాతో ఒవైసీ మాట్లాడారు. ‘‘కవిత, షకీల్​ గెలుపు కోసం మా వాళ్లు రాత్రింబవళ్లు కష్టపడ్డరు. బీఆర్ఎస్​ను ఫ్యామిలీగా భావించాం. చివరకు మా వాళ్లపై 307 సెక్షన్​కేసులు పెట్టి జైళ్లకు పంపినరు. ఇక బీఆర్ఎస్​తో మంచి సంబంధాలు ఎక్కడున్నట్టు?’’ అని ఒవైసీ వ్యాఖ్యానించారు.
  • మా బ్యాటింగ్​ మేమే చేస్తం

  • అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని బీఆర్ఎస్​ లీడర్లు మరిచిపోతున్నారని అసదుద్దీన్​ అన్నారు. రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి ఇప్పటివరకు ఏమీ ఆలోచించలేదని, ఎవరితో జట్టు కడతామనేది మున్ముందు తెలుస్తుందన్నారు. ‘‘మా బ్యాటింగ్​మేమే చేస్తం. స్కోర్​చూసుకుంటాం. ఆపై ఎవరిని అవుట్​ చేయాలో నిర్ణయిస్తం. మజ్లిస్​పోటీ చేసే స్థానాలను త్వరలో ప్రకటిస్తం” అని ఒవైసీ చెప్పారు. అలాగే వచ్చే లోక్​సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో ఎంపిక స్థానాల నుంచి పోటీచేస్తామని ఆయన తెలిపారు. ఇక, బీఆర్ఎస్​ విస్తరణ కోసం సీఎం కేసీఆర్​ చేస్తున్న ప్రయత్నాలపై  స్పందిస్తూ.. కేసీఆర్​ భారత పౌరుడని, ఆయన ఎక్కడికైనా వెళ్లొచ్చని వ్యాఖ్యానించారు. 
  • మోదీ మరోసారి ప్రధాని కావద్దనేదే మా టార్గెట్​

  • 2024లో మూడోసారి కూడా నరేంద్ర మోదీ ప్రధాని కాకూడదన్నదే తమ లక్ష్యమని అసదుద్దీన్​ అన్నారు. ఈ విషయంలో తమతో కలిసివచ్చే పార్టీలను కలుపుకొని వెళ్తామని చెప్పారు. బీజేపీకి వ్యతిరేకంగా రెండు రోజుల కింద పాట్నాలో ప్రతిపక్షాలు నిర్వహించిన మీటింగ్ కు తనకు ఆహ్వానం అందలేదని వెల్లడించారు. ఇందుకు కారణాలు తెలియవన్నారు.