ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా పెనుదుమారం రేపిన అంశం వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ కేసు విషయంలో జగన్ సోదరి షర్మిల, వివేకా కూతురు సునీతలు జగన్, అవినాష్ రెడ్డిలపై ప్రత్యక్ష విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో కీలకంగా మారింది. తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కేసు విషయంలో సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు. బెయిల్ పై ఉన్న నిందితులు భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిలతో కలిసి నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు అవినాష్ రెడ్డి.
చంచల్ గూడా జైలులో ఉన్న నలుగురు నిందితులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జడ్జి ఎదుట హాజరు పరిచారు. ఈ క్రమంలో తదుపరి విచారణను జూన్ 11కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది సీబీఐ కోర్టు. గతంలో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కొట్టివేయాలంటూ అప్రూవర్ దస్తగిరి వేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.