
చంద్రబాబు, లోకేష్ చేస్తున్న పాదయాత్ర ఎఫెక్ట్ తోనే ఏపీలో వర్షాలు కురవడం లేదని కడప ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శించారు. 1999 నుంచి 2004 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కరువుగా కేరాఫ్ అడ్రస్ గా ఉంటే 2004లో రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక భారీ వర్షాలు కురిశాయని చెప్పారు. జగన్ సీఎం అయ్యాక గత నాలుగేళ్లుగా భారీగా వర్షాలు కురిసాయని చెప్పుకోచ్చారు.
చంద్రబాబు, నారా లోకేష్ హైదరాబాద్ కే పరిమితమవడంతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడ్డాయని తెలిపారు. ఎప్పుడైతే... లోకేష్ పాదయాత్ర, చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల సందర్శన చేశారో... వర్షాలు భయపడి అటే పారిపోయాయని అవినాష్ ఎద్దేవా చేశారు. రెండు బలమైన పాదాల ఎఫెక్ట్ వల్లే వరుణుడు కరుణించడం లేదన్నారు.
గత 60 రోజులుగా చుక్క వర్షం కూడా కురవకపోవడం వెరసి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతూ ఉంది. ఈ నష్టాలకు సంబంధించిన రెండు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నష్టపరిహారం అందిస్తామని అవినాష్ రెడ్డి భరోసా ఇచ్చారు.
చంద్రబాబు, లోకేష్ యాత్రల పేరుతో ఏపీ తిరుగుతున్నారంట.. అందుకే కరువు వచ్చిందంట.. ఏపీ నుంచి వెంటనే హైదరాబాద్ వెళ్లిపోవాలంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి.. ?#TDP #NaraLokeshPadayatra #ChandrababuNaidu #AndhraPradesh #rains #YSRCPSocialMedia #Kadapa #MPAvinashreddy #Rayalaseema pic.twitter.com/5wF4AJjuoB
— raghu addanki (@raghuaddanki1) September 1, 2023