షర్మిలపై అవినాష్ ఫిర్యాదు.. నోటీసులు జారీ చేసిన ఈసీ..

ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తూ వివేకా హత్య కేసు విషయంలో షర్మిల పదేపదే జగన్, అవినాష్ లపై ప్రత్యక్షంగా విమర్శలు చేస్తున్న క్రమంలో వైసీపీ నేతలు చేసిన ఫిర్యాదు మేరకు షర్మిలకు ఈసీ ఇప్పటికే నోటీసులు పంపగా, తాజాగా ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు మరోసారి షర్మిలకు ఈసీ నోటీసులు జారీ చేసింది.

ఎన్నికల ప్రచారంలో షర్మిల వివేకా హత్య కేసును ప్రస్తావించారని, వైసీపీ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారని, కోడ్ ఉల్లంఘించినందున షర్మిలపై తగిన చర్యలు తీసుకోవాలని అవినాష్ రెడ్డి, మల్లాది విష్ణులు చేసిన ఫిర్యాదు మేరకు నోటీసులు జారీ  చేసింది ఈసీ.కోడ్ ఉల్లంఘన పట్ల 48గంటల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే తగిన చర్యలు తప్పవని తెలిపింది ఈసీ.