నకిరేకల్,(వెలుగు): కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, నల్గొండ జిల్లాలోనే నలుగురు సీఎం అవుతామని చెబుతున్నారని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ విమర్శించారు. నకిరేకల్ పట్టణంలోని బీఆర్ఎస్ ఆఫీస్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులకు ప్రజలకు సేవ చేద్దామనే ఆలోచన లేదని, గెలువకముందే పదవులు కోసం కొట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
నియోజకవర్గ ప్రజలు రౌడీయిజం లేకుండా ప్రశాంతంగా ఉండాలంటే లింగయ్యను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, మార్కెట్ చైర్మన్ ప్రదీప్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నవీన్ రావు, పట్టణ అధ్యక్షుడు సైదిరెడ్డి పాల్గొన్నారు.