ప్రతి పక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి : ఎంపీ  బలరాం నాయక్​ 

ప్రతి పక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి : ఎంపీ  బలరాం నాయక్​ 
  • కాంగ్రెస్ క్యాడర్ కు సూచించిన మహబూబాబాద్​ ఎంపీ  బలరాం నాయక్​ 

డోర్నకల్​, (గార్ల), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి పక్షాల అసత్య ప్రచారాలను పార్టీ కార్యకర్తలు తిప్పి కొట్టాలని మహబూబాబాద్​ఎంపీ పోరికబలరాం నాయక్​ సూచించారు.  మంగళవారం గార్ల మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..   సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్  నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.

రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఫ్రీ బస్సు, సన్న వడ్లకు రూ.500   బోనస్, ఉచిత కరెంటు , రూ. 500 సబ్సిడీ గ్యాస్,  హాస్టల్ విద్యార్థులకు  అత్యున్నత స్థాయి సౌకర్యాలు , ఏడాదిలోనే 50వేలకుపైగా జాబ్ లు  ఇచ్చినట్టు పేర్కొన్నారు.  గార్ల మండల అఖిల పక్షం కమిటీ దరఖాస్తులను పరిశీలించి గార్లలో మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్​ప్రెస్​ నిలిపేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడతానని తెలిపారు.  

ఆయన వెంట పార్టీ నేతలు రావూరి వెంకటరామయ్య, సూర్యపురెడ్డి వెంకటరెడ్డి , గుండా వెంకట్ రెడ్డి, మాలోత్ వెంకట్ లాల్, ధనియాకుల రామారావు తదితరులు ఉన్నారు.