
బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించే దమ్ము మీకు లేదన్నారు. మీలో ప్రవహించేది తెలంగాణ రక్తమే అయితే బీఆర్ఎస్ ను వీడి రావాలంటూ తీవ్ర వాఖ్యలు చేశారు.
తెలంగాణ చరిత్రను కనుమరుగు కానివ్వమన్న సంజయ్.. కేసీఆర్ మోసాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటామన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఎందుకు అధికారికంగా జరపడానికి కేసీఆర్ కు ఉన్న అభ్యంతరాలు ఎంటో చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ నయా నిజాంగా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఎంఐఎంతో కలిసి జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహిస్తున్నారని ఆరోపించారు. రజాకార్ల వారసత్వ పార్టీలు బీఆర్ఎస్, ఎంఐఎం అని సంజయ్ ఘాటు విమర్శలు చేశారు.