కరీంనగర్, వెలుగు: ఎన్నికల షెడ్యూల్ వచ్చే సమయానికే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర ద్వారా కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గాన్ని చుట్టేశారు. శనివారం జిల్లాలోని తిమ్మాపూర్, సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంజయ్ శంకుస్థాపన చేశారు. షెడ్యూల్ వెలువడటానికి కొద్ది నిమిషాల ముందే ఆయా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజాహిత యాత్రను ముగించారు.
తొలి, మలి విడత కలిపి కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, సిద్ధిపేట, హన్మకొండ జిల్లాల్లో కలిపి మొత్తం 44 మండలాల్లోని 211 గ్రామాల్లో 753 కి.మీల మేరకు యాత్ర కొనసాగింది.