వచ్చే లోకసభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 10 నుంచి 15 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఎంపీ బండి సంజయ్. గతంలో క్యాడర్, కెపాసిటీ లేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యల్లో ఎక్కడ పాలుపంచుకోలేదన్నారు.
రాష్ట్రంలో ప్రజలను రాచి రంపాన పెట్టిన బీఆర్ఎస్ నాయకులను ప్రజలు చిత్రీకరించారని.. కబ్జాలు అవినీతికి పాల్పడి ప్రజలను ఇబ్బంది పెట్టిన లీడర్లంతా ఇప్పుడు కాంగ్రెస్ లో చేరుతున్నారని విమర్శించారు. నీతి నిజాయితీగా పనిచేసిన నాయకులు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ఓట్లు వేస్తే కాంగ్రెస్ గెలిచిందే తప్ప.. కాంగ్రెస్ మీద అభిమానంతో జనం ఓట్లు వేయలేదని తెలిపారు. అన్ని సర్వే ఫలితాలు పాలమూరు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పారు ఎంపీ బండి సంజయ్.