అవసరమైతే తాను భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు మారువేషంలోనైనా చేరుకుంటానని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కాగా.. భాగ్యలక్ష్మీ టెంపుల్‌కు వెళ్లడానికి బండి సంజయ్‌కు పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే బండి సంజయ్ టెంపుల్‌కి వెళ్లి దర్శనం చేసుకోవచ్చని.. దానికి పర్మిషన్ అవసరం లేదని కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. బండి సంజయ్ దర్శనానికి వెళ్లొచ్చు కానీ, ర్యాలీగా వెళ్లడానికి పర్మిషన్ లేదని ఆయన తెలిపారు.
కాగా.. ఈ పర్మిషన్ విషయంపై బండి సంజయ్ స్పందించారు. భాగ్యలక్ష్మి టెంపుల్‌కు వెళ్లేందుకు తనకు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి రాలేదని ఆయన అన్నారు. ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా.. పర్మిషన్ పేరుతో తనను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని ఆయన అన్నారు. అయితే తాను ఎలాగైనా సరే అనుకున్న సమయానికి భాగ్యలక్ష్మి టెంపుల్‌కు చేరుకుంటానని ఆయన అన్నారు. అవసరమైతే మారువేషంలోనైనా గుడికి చేరుకుంటానని ఆయన తేల్చి చెప్పారు.
హైదరాబాద్‌లో వరద సాయం ఆపాలంటూ ఎస్ఈసీకి తాను లేఖ రాశానంటూ సీఎం కేసీఆర్ తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తూ.. చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేయడానికి రావాలంటూ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. అందుకోసం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మీ గుడికి ర్యాలీగా వెళ్తానన్నారు. అయితే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున బీజేపీ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. అయితే.. బండి సంజయ్ మాత్రం భాగ్యలక్ష్మి టెంపుల్‌కు ఉదయం 11 గంటల నుంచి 12 మధ్యలో వెళ్లి దర్శించుకోవచ్చని పోలీసులు తెలిపారు.
For More News..