కరీంనగర్ టౌన్, వెలుగు: 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్నిలుస్తుందని, అందుకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని ఎంపీ బండి సంజయ్తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను కలెక్టర్పమేలా సత్పతితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని అభివృద్ది చేయాలని ఉద్దేశంతో 5 రాష్ట్రాల్లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రను చేపట్టామని వెల్లడించారు. జిల్లాలో ఈనెల 16 నుంచి జనవరి 26 వరకు ఆ యాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ చేపడుతున్న సంక్షేమ పథకాలు దేశంలోని ప్రతీ మారుమూల గ్రామాల్లోని లబ్ధిదారులకు చేరేదాకా సంకల్పయాత్రను కొనసాగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీలత, డీఎంహెచ్‌వో లలితాదేవి, డీడబ్ల్యూవో సరస్వతి, ఆంజనేయులు, రాములు పాల్గొన్నారు.