యాక్సిడెంట్ బాధితులను సొంత కారులో ఆస్పత్రికి పంపిన బండి సంజయ్

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మానవత్వం చాటుకున్నారు. తానొక ఎంపీని, పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని అని గొప్పలకు పోకుండా.. ఆపదలో ఉన్నవారికి సాయమందించారు. బండి సంజయ్ గురువారం వరంగల్ పర్యటనకు వెళ్తుండగా మానకొండూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో యాక్సిడెంట్ అయింది. పున్నం రమేష్ , పున్నం రమ, సంకీర్తన్ అనే ముగ్గురు వ్యక్తులు బైక్ పై హుజురాబాద్ నుండి కరీంనగర్‌కు వెళ్తుండగా.. రోడ్డు సరిగా అదుపుతప్పి కింద పడ్డారు. దాంతో వారికి తీవ్రంగా గాయలయ్యాయి. అది చూసిన సంజయ్.. తమ కాన్వాయ్‌ను ఆపి వారి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత వారిని చికిత్స కోసం ఆయన సొంత కారులోనే కరీంనగర్ ఆస్పత్రికి పంపించారు.

For More News..

వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఖర్చులేమీ తగ్గవు..

ప్రధాని మోడీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్

రాష్ట్రంలో కొత్తగా 2,817 కరోనా కేసులు.. 10 మంది మృతి