హాలియా, వెలుగు: తిరుమలగిరి (సాగర్) మండలం ఎంపీఏ ఆంగోతు భగవాణి యక గురువారం నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. పార్టీలో చేరిన భగవాన్ నాయకు ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం జైవీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభు త్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలువురుఎంపీపీలు, జడ్పీటీసీలు, బీఆర్ ఎస్ ముఖ్యనాయ కులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు.
ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కార్యక్ర మంలో మాజీజడీ ఫ్లోర్ లీడర్ లింగారెడ్డి, మాజీ ఎంపీపీ రమావత్ శంకర్ నాయక్, నాయకులు సాగర్ ప్రసాద్, పగడాల నాగరాజు, ఉంగరాల శీను తదితరులు పాల్గొన్నారు.