బీబీ పాటిల్​కు త్రుటిలో తప్పిన ప్రమాదం

పిట్లం, వెలుగు: జహీరాబాద్​ ఎంపీ బీబీ పాటిల్​కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి ఆయన గురువారం తన కారులో హైదరాబాద్  నుంచి కామారెడ్డి జిల్లా బిచ్కుందకు వస్తున్నారు. జుక్కల్  చౌరస్తా వద్ద ఓ బైక్  ఆయన కారుకు అడ్డం వచ్చింది. బైక్​ను తప్పించబోయే క్రమంలో ఎంపీ కారు డివైడర్​ను ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో కారు ముందు టైర్లు పంక్చర్ అయ్యాయి. ఎంపీకి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత మరో వెహికల్​లో ఆయన ప్రచారానికి వెళ్లారు.