జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కు తెలుగు భాషా తంటాలు

ఇద్దరు తమిళులు ప్రపంచంలో ఎక్కడ కలుసుకున్నా తమిళంలో మాట్లాడుకుంటారట. ఇద్దరు తెలుగువాళ్లు ఎక్కడ కలుసుకున్నా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారని మనవాళ్ల మీద ఉన్న విమర్శ. అది ఎంత నిజమన్నది పక్కన బెడితే ఓ నాయకుడికి తెలుగుతోనే పెద్ద తలనొప్పి వచ్చిపడింది. అనుచరులు మాత్రం ఆయన తెలుగులో మాట్లాడితే చూడాలనుకుంటున్నారట. 

ALSOREAD :ఇంతే ఇంత మ్యాగీ.. 200 రూపాయలా.. దేంతో వండారేంటీ..?

రెండు సార్లు జహీరాబాద్ ఎంపీగా గెలిచిన బీబీ పాటిల్ పెద్దగా హడావుడి లేకుండా తన పనేదో తాను చేసుకుంటున్నట్లుగా ఉంటారు. మంత్రుల టూర్లు, అవసరమైతేనే అధికారిక కార్యక్రమాలకు వెళ్తుంటారు. అట్లాంటి సందర్భాల్లో మాత్రమే ప్రజలకు కనిపిస్తుంటారు. పెద్దగా జనంలో కలవట్లేదన్న టాక్ ఆయన సొంత వర్గంలోనే ఉంది. ఆయన్ను కలవాంటే హైదరాబాద్ ఆఫీసుకు పోవాలనీ, లోకల్ గా మాత్రం అందుబాటులో ఉండరన్న పేరుంది. సొంత వ్యాపారాలు ఉండడం వల్ల బీజీగా ఉంటారని అనుచరులు చెబుతుంటారు. 

అయితే.. బీబీ పాటిల్ బయటికి రాకపోవడానికి వేరే కారణం ఉందనీ, ఆయనకో ఇబ్బంది ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఆయనకు తెలుగు అంతగా రాకపోవడమే సమస్యని చెబుతున్నారు. నిజానికి జహీరాబాద్ పరిధిలో జనానికి చాలావరకు హిందీ తెలుసు. అయితే వేగంగా మాట్లాడే పాటిల్ అలవాటు వల్ల సరిగా అర్థం కాదన్న ఫీలింగ్ లోకల్ గా ఉంది. ఇక తెలుగు అంతగా రాకపోవడం వల్ల మరీ అవసరమైనప్పుడే పేపర్ మీద రాసుకున్న సమాచారాన్ని చదివి ముగిస్తుంటారు. మీటింగ్ లలో దాదాపుగా తెలుగులో మాట్లాడడానికి ఇష్టపడరు.

జనంలోకి వెళ్లకపోవడం గురించి పార్టీ పెద్దల నుంచి కూడా అలర్ట్ ఉందని చెబుతున్నారు. కనీసం స్థానిక నేతలకు అందుబాటులో ఉండట్లేదని ఆయన అనుచరులే అంటున్నారు.