రాములోరికి ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ

సుల్తానాబాద్​, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ మండలం రామునిపల్లి, సుద్దాల గ్రామాల్లోని రామాలయాల్లో బుధవారం   పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు. ఈ  సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ఆహ్వానించి శాలువాలతో సన్మానం చేశారు. అనంతరం ఎమ్మెల్యే విజయరమణారావు, ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, వర్షాలు బాగా పడి పంటలు పండాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  జడ్పీటీసీ మినుపాల స్వరూపప్రకాశరావు, అన్నయ్యగౌడ్​, చిలుక సతీశ్​, ఉనుకొండ శ్రీధర్​పటేల్​, భూమయ్య పాల్గొన్నారు. 

రామగుండానికి  పూర్వ వైభవం రావాలి

గోదావరిఖని:    సీతారాముల దీవెనలతో రామగుండం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, రామగుండానికి పూర్వ వైభవం రావాలనికాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ అన్నారు  ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్​ దంపతులతో కలిసి ఆయన  గోదావరిఖనిలోని కోదండ రామాలయంలో బుధవారం జరిగిన కల్యాణంలో వారు పాల్గొన్నారు.