కాంగ్రెస్ గెలుపు ఖాయం : రఘువీర్ రెడ్డి

 

మిర్యాలగూడ, వెలుగు : ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధిస్తుందని ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం జరిగిన ఎంపీ ఎన్నికల్లో భాగంగా మిర్యాలగూడలోని పలు పోలింగ్ కేంద్రాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి ఆయన సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు అత్యధిక మెజార్టీ అందించాలనే లక్ష్యంతో పార్టీశ్రేణులు కష్టపడి పనిచేశారని తెలిపారు. పేదల సంక్షేమమే ప్రభుత్వం ధ్యేయమన్నారు.