మూసీ నదిపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంచేస్తుందని ఎంపీచామల కిరణ్ కుమార్ విమర్శించారు. మురికి కూపంలో బతికే వాళ్లను అందులోనే ఉంచాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందన్నారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా బీఆర్ఎస్ తీరు మారలేదన్నారు.
10 ఏండ్లలో ఏం చేశారు ప్రజల మధ్య చర్చ పెడదాం.. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలన.. 10 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమన్నారు చామల. డీపీఆర్ లేకుండానే కాళేశ్వరం కట్టారని ఆరోపించారు. కమీషన్ల కోసంమే కాళేశ్వరం కట్టారని ధ్వజమెత్తారు.
మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం లక్షన్నర కోట్లు వృథా చేస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ,బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతల విమర్శలను తిప్పికొడుతున్నారు.