
మాజీ మంత్రి హరీశ్ రావుపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ దుబాయ్ వెళ్లిన రోజే టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతి చెందాడని ఆరోపించారు. కేదార్ మృతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు చామల. బ్లాక్ మనీని వైట్ చేసేందుకే హరీశ్ దుబాయ్ టూర్ కు వెళ్లారని ఆరోపించారు. ఎలక్షన్లు, కలెక్షన్లు ఆయన నినాదామన్నారు. దుబాయ్ టూర్ వివరాలు హరీశ్ ఎందుకు గోప్యంగా ఉంచారని ప్రశ్నించారు ఎంపీ చామల. ప్రతీది ట్విట్టర్లో పెట్టే హరీశ్ రావు..దుబాయ్ టూర్ వివరాలను ఎందుకు సోషల్ మీడియాలో పెట్టలేదని ప్రశ్నించారు ఎంపీ చామల.
ఎస్ఎల్ బీసీ టన్నెల్ ఘటనను బీఆర్ఎస్ అనవసరంగా రాజకీయం చేస్తుందన్నారు ఎంపీ చామల. గతంలో ప్రమాదాలు జరిగినప్పుడు ఏనాడైనా కేసీఆర్ వెళ్లారా అని ప్రశ్నించారు. ప్రతి రోజు మధ్యాహ్నం తొడలు గొట్టడానికి బీఆర్ఎస్ నేతలు బయటకు వస్తారని విమర్శించారు. నల్గొండలో బీఆర్ఎస్ కు నాయకులే లేరన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణకు నిధులు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ ఊసే లేకుండా చేశారన్నారు ఎంపీ చామల.
ALSO READ | ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై హైకోర్టులో పిల్
టాలీవుడ్ నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్ లో ఫిబ్రవరి 25న గుండెపోటుతో మృతి చెందారు. అయితే కేదార్ కు పలువురు బీఆర్ఎస్ కీలక నేతలతో సంబంధం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దుబాయ్ లో రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో కేదార్, పలువురు బీఆర్ఎస్ కీలక నేతలు పెట్టుబడులు పెట్టినట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.