రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చూస్తాం :  ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చూస్తాం :  ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

చేర్యాల, కొమురవెల్లి, వెలుగు: ఈ ప్రాంతంలోని రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చూస్తామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం కొమురవెల్లి మండలంలోని తపాస్​పల్లి రిజర్వాయర్ ను, చేర్యాల మండలంలోని అర్జునిపట్ల, కమలాయపల్లిలో కాల్వలను మద్దూరు మాజీ జడ్పీటీసీ గిరికొండల్ రెడ్డితో కలిసి సందర్శిచారు.

ఈ సందర్భంగాఎంపీ మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా తపాస్​పల్లి రిజర్వాయర్ లోకి నీటిని విడుదల చేయకపోవడంతో రిజర్వాయర్ లో నీటి శాతం తగ్గి, చెరువులు, కుంటలు ఎండిపోయి భూగర్భజలాలు అడుగంటి పోయాయన్నారు. దీంతో సాగునీరు అందక పొలాలు ఎండిపోతున్నాయన్నారు. ధర్మసాగర్, బొమ్మకూరు నుంచి నీటిని విడుదల చేసి ఈ ప్రాంతంలో ఉన్న కుడి, ఎడమ కాల్వల ద్వార నీటిని మళ్లించి రైతుల పంటలకు సాగునీరు అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం చేర్యాల మండలంలోని అర్జున్ పట్ల, కమలాయపల్లి గ్రామాల్లో పర్యటించి తపాస్​పల్లి రిజర్వాయరుకు సంభందించిన డి3, రంగనాయక్ సాగర్ ఎల్​డీ10 కాల్వలను పరిశీలించారు. త్వరలో నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. ఆయన వెంట కొమ్ము నర్సింగరావు, కాటం మల్లేశం, రాములు ఉన్నారు.