
యాదాద్రి, వెలుగు : అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించడానికి తన వంతు కృషి చేస్తానని ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో జర్నలిస్టులు బుధవారం ఎంపీ చామల, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే కుంభం, కలెక్టర్ హనుమంతరావును కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం స్కీమ్‌లో అప్లయ్చేసుకున్న వారిలో అర్హులైనవారికి యూనిట్లు ఇస్తామని చెప్పారు.
ఇండ్ల స్థలాలు ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌లో మంజూరు చేస్తామన్నారు. ఎయిమ్స్‌లో వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. వినతిపత్రం ఇచ్చినవారిలో యూనియన్ లీడర్లు నరసింహులు, పోతంశెట్టి కరుణాకర్, భువనగిరి మల్లేశం, జీవీ శ్రీనివాస్, కందుకూరి సోమయ్య, జి.హరిబాబు, కె.మల్లేశం, పి.ఆనంద్, పాశం నవీన్, ఎండీ జమాల్, మహేశ్, ఉదయ్ రెడ్డి, దిలీప్ గౌడ్ ఉన్నారు.