హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కౌశిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వి  స్ట్రీట్ డ్రామాలు : ఎంపీ చామల కిరణ్ కుమార్

  • కాంగ్రెస్ విజయోత్సవాలు చూడలేకే రాద్ధాంతం: ఎంపీ చామల

న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి ప్రజల్లో సానుభూతి కోసం చిల్లర రాజకీయాలు చేస్తు్న్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ విజయోత్సవాలను చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్న ఆయన గురువారం ఒక వీడియో రిలీజ్ చేశారు.

మీడియా, ప్రజలను పక్కదారి పట్టించేందుకు హరీశ్ రావు, కౌశిక్ రెడ్డి స్ట్రీట్ డ్రామాలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. వాళ్లకు వాళ్లే పోలీస్ స్టేషన్లకు వెళ్లి గొడవలు సృష్టించి అరెస్టు చేయించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పదేండ్లలో జరగని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చేసిందని తెలిపారు.