మూసీ ప్రక్షాళనను రాజకీయం చేయొద్దు : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మూసీ రివర్ బెడ్ పై ఉన్న ప్రజలను కలవడంలో తప్పులేదని, మూసీ ప్రక్షాళనను రాజకీయం చేయొద్దని భువనగిరి ఎంపీ చామల కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మూసీ వద్ద బస చేసిన కిషన్ రెడ్డి సాక్సులు వేసుకుని పడుకున్నారని, అక్కడ కెమెరా పెట్టుకుని ఫొటోలు తీయించుకుని మీడియాకు రిలీజ్ చేశారని, ఆయన కార్యక్రమం ఫొటో షూట్ ను తలపించిందని ఎద్దేవా చేశారు. 

మూసీ నిర్వాసితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, వారి పిల్లల భవిష్యత్తు కోసం పార్టీలకతీతంగా సహకరించాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని, మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడానికి కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. పదేండ్లు పాలించిన బీఆర్ఎస్ తో ప్రజలకు ఒరిగిందేమిలేదన్నారు.