
- కేసీఆర్ దీక్ష చేస్తాననటం విడ్డూరం
- జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై ఎంపి చామల
హైదరాబాద్: సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ పై ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తామనటం విడ్డూరంగా ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. దళితులపై, దళిత నాయకులపై మీకున్న ఆలోచన విధానం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఉద్యమ సమయం నుంచే కేసీఆర్ దళితులను మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు దళితులను అవమానించారన్నారు.
నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను బర్తరఫ్ చేశారని, అందుకు ఎలాంటి కారణాలు చెప్పదేలన్నారు. ప్రణబ్ ముఖర్జీ హైదరాబాద్ వస్తే ఆయన కాళ్లు మొక్కారని, కోవింద్ వస్తే మాత్రం కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. దళితులను మోసం చేయడమే ఆ పార్టీ విధానంగా ఉందన్నారు.